![]() |
![]() |
.webp)
ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో యాంకర్ శ్రీముఖి పుట్టినరోజు సెలెబ్రేషన్స్ ని ఎంతో ఘనంగా చేశారు. చిన్నప్పుడు శ్రీముఖికి అన్న ప్రాసన కార్యక్రమం జరగలేదని చెప్పడంతో అవినాష్, హరి కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీముఖి కళ్ళకు గంతలు కట్టారు. తరువాత నేల మీద ఆదుకునే గిలక్కాయ, గోల్డ్ కాయిన్స్-డబ్బులు, మైక్, వాచ్, పుస్తకం పెట్టారు. ఆమెకు కళ్ళకు గంతలు కట్టేశారు. తర్వాత హరి కార్తీక దీపం డాక్టర్ బాబుని అడిగాడు "అన్నా శ్రీముఖి ఎం పట్టుకుంటుంది అనుకుంటున్నారు" అన్నాడు. "ఏదైనా తనకు కావాల్సిందే పట్టుకుంటుంది.. మనీ అండ్ గోల్డ్" అన్నాడు. "అది పెద్దాయన" అని అంది శ్రీముఖి. ఆ తర్వాత వెతుకుతూ వెతుకుతూ డబ్బు, బంగారాన్ని పట్టుకుంది శ్రీముఖి.
ఇక హరి ఐతే మైక్ తీసుకుని "ఐతే యాంకరింగ్ వదిలేస్తారంటారా" అన్నాడు . అవినాష్ ఐతే "మీరు అనుకున్నదే సాధిస్తారు అమ్మగారు" అన్నాడు. "ఏయ్ నేను యాంకరింగ్ వదిలేయను. ఇదిగో ఇన్ని డబ్బులు వస్తే ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీ ఇద్దరితో షో చేస్తాను" అంటూ అవినాష్ కి, హరికి చెప్పింది. ఐతే తనకు 32 ఏళ్ళు వచ్చేసాయి అంటే తనకు నమ్మబుద్ది కావడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ షోలో శ్రీముఖి పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఫొటోస్ ని పెట్టి అవి ఏ ఏజ్ లో ఉన్న ఫొటోస్ అంటూ టాస్క్ ఇచ్చారు హరి- అవినాష్. షోకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళు తెలిసిన ఏజ్ గ్రూప్స్ రాసేసరికి శ్రీముఖి అవి కరెక్టా కాదా అని చెప్పారు.
![]() |
![]() |